తాళ్లూరు మండలంలోని నాగంబొట్ల పాలెం విద్యుత్ సబ్ స్టేషన్ పరధిలో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని మండల ఎఈ రామక్రిష్ణా రెడ్డి తెలిపారు. సబ్ స్టేషన్లో 5 ఎంవిఏ ట్రాన్స్ ఫార్మర్ మార్చి దాని స్థానంలో 8 ఎం. విఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయుచున్న తరుణంలో విద్యుత్ అంతరాయం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటుందని చెప్పారు. వినియోగదారులు, రైతులు అసౌకర్యాన్ని గమనించి ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు
27న నాగంబొట్ల పాలెం సబ్ స్టేషన్ పరధిలో విద్యుత్ అంతరాయం – ఎఈ రామక్రిష్ణా రెడ్డి
26
Dec