రాష్ట్రంలో మత్స్య సంపద పెంపునకు, మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి
అన్నారు.
ప్రధానమంత్రి మత్య్స యోజన పథకం కింద మత్య్సకారులకు తూర్పునాయుడుపాలెంలోని ఆయన స్వగృహంలో శుక్రవారం ఆయన వలలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి డోలా బాలవీరాంనేయస్వామి మాట్లాడుతూ, మత్య్సకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ మత్స్య సంపద పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏడు మంది సంప్రదాయ మత్య్సకారులకు ఒక్కొక్క యూనిట్ 2లక్షల 43వేల రూపాయల విలువైన వలలను అందించడం జరిగిందన్నారు. త్వరలోనే మత్స్యకారులకు బోట్లు, ఇంజన్లు కూడా అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. మత్య్సకారులకు 50 సంవత్సరాలకు పింఛన్ అందిస్తున్నామన్నారు. మత్య్సకారులు తమ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామన్నారు. సీ ఫీడ్ ద్వారా మత్య్సకారులు ఆదాయం పొందాలన్నారు. 40శాతం రాయితీపై త్వరలో మత్య్సకారులకు ఆటోలు అందచేస్తామని చెప్పారు.

