ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో డాగ్ స్క్వాడ్ (పేలుడు పదార్థాలు కనుగొనేందుకు జాగిలం-చీత) మరియు బాంబు స్క్వాడ్‌తో పాటు పోలీస్ లు పాల్గొన్నారు.
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు పార్శిల్ సెంటర్లలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అనుమానాస్పద వస్తువులు, అపరిచిత లగేజీలను గుర్తించేందుకు బస్టాండ్ ఆవరణ, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. అనుమానం కలిగిన ప్రయాణీకుల బ్యాగులను ప్రత్యేకంగా తెరిపించి చెక్ చేశారు.
అనుమానాస్పద పార్సిళ్లు కనిపించిన వెంటనే లేదా గుర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పటిష్టమైన భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ తనిఖీలలో ఆర్ ఎస్సై ప్రసాద్, డాగ్ హ్యాండ్లర్ ప్రభాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.


