బేగంపేట డిసెంబర్ 27, (జే ఎస్ డి ఎం న్యూస్) : భారతీయ జనతా పార్టీ మహంకాళి సికింద్రాబాద్
జిల్లా ప్రధాన కార్యదర్శి గా నెమలి ఆనంద్ (నందు ) నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఆనంద్ ను పలువురు సీనియర్ పార్టీ నాయకులు కలిసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా నెమలి ఆనంద్ (నందు) మాట్లాడుతూ తనపై నమ్మకంతో బి జె పి పార్టీ అప్పగించిన బాధ్యతలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు.జిల్లాలో బి జె పి పార్టీ పటిష్టతతో పాటు డివిజన్లో పార్టీని మరింత బలోపేతం చేస్తానని ఆయన అన్నారు. నాయకులు కార్యకర్తలు అభిమానుల సహకారంతో బిజెపిని గల్లీలో మరింత బలపరుస్తామన్నారు.
నెమలి ఆనంద్ కు అభినందనలు తెలిపిన వారిలో సనత్ నగర్ బిజెపి నాయకులు బిక్షపతి గౌడ్, సురేష్ రాహుల్ ,దశరథ్ గౌడ్, బాబు, నర్సింగ్ ,సందీప్ వర్మ, మల్లికార్జున్ గౌడ్, అనిల్ గౌడ్, ప్రశాంత్, పెద్ది అనిల్, రాజు ప్రమోద్ తదితరులు ఉన్నారు .

