బేగంపేట డిసెంబర్ 27, (జే ఎస్ డి ఎం న్యూస్) :
సైబర్ నేరాలపై అనుక్షణం ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని బేగంపేట ఇన్స్పెక్టర్ సైదులు తెలియజేశారు. శనివారం బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్పుర ఇందిరమ్మ కాలనీలో జాగ్రత్త హైదరాబాద్ సురక్షిత హైదరాబాద్ ( సైబర్ సింబ) పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ నార్త్ జోన్ డిసిపి ఎస్ పేర్మల్ మార్గ నిర్దేశంలో బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని బేగంపేట పోలీసులు రసూల్ పురా ఇందిరమ్మ నగర్ లోని యూనివర్సల్ ఎంటర్ప్రైజెస్ లో సిబ్బందికి అవగాహన కల్పించారు.చేపట్టారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైదులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్లో వాడకం పెరగడంతో సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని తెలియజేశారు అవగాహన పెంచుకోవడం వల్ల సైబర్ మోసాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు అన్నారు తాము బ్యాంకు అధికారుల మంటూ కొందరు మోసాలకు పాల్పడుతుంటే మరి కొందరు మీకు కేవైసీ అప్డేట్ చేయాలని ఇంకొందరు ఓటిపిలు చెప్పాలని, ఇలా ఫోన్లు చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని వీరు పట్ల అప్రమత్తంగా లేకుంటే బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందన్నారు కంప్యూటర్ లేదా మొబైల్ లోకి వైరస్లను పంపి డేటాను లాక్ చేయడం దాన్ని అన్లాక్ చేయడం నూతన సంవత్సర శుభాకాంక్షలు పేరుతో లింకు లేదా ఏపీకే ఫైల్ పంపడం మోసగాళ్లు చేస్తుంటారని ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు ఎలాంటి ఆపులను డౌన్లోడ్ చేయవద్దని కొత్త లింకులను అసలే ఓపెన్ చేయవద్దు అన్నారు ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయడం ఎం సి ఆర్ పి పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయడం వెంటనే బ్యాంకుకు సమాచారం ఇచ్చి కార్డులను అకౌంట్లను బ్లాక్ చేయాలన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్ఐ షఫీ పోలీస్ సిబ్బంది యూనివర్సల్ ఎంటర్ప్రైజెస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

