నియమ నిబంధనలు ఉల్లఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఉప రవాణా కమీషనర్ ఆర్ సుశీల అన్నారు. జిల్లా కలెక్టర్ రాజా బాబు ఉత్తర్వుల మేరకు శనివారం ఉప రవాణా శాఖ కార్యాలయంలో ఉపరవాణా కమీషనర్, మైన్స్ డీడి రాజశేఖర్ ఆధ్వర్యంలో సంయుక్తంగా టిప్పర్, ట్రాలీ, క్రషర్ యజమానులకు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప రవాణా కమీషనర్ ఆర్ సుశీల మాట్లాడుతూ చీమకుర్తి, రామతీర్థం, మర్రి చెట్ల పాలెం తదితర ప్రాంతాల నుంచి అధిక బరువు తో భారీ వాహనాలలో గ్రానైట్ కంకర బండ రాళ్లు అధిక బరువుతో తోలటం వలన రహదారులు పాడవుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వాటి నివారణకు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. వాహనాలు లోడుతో ఉన్నప్పుడు తప్పనిసరిగా టార్పాలిన్ పట్టలు ఖచ్చితంగా కట్టాలని చెప్పారు. అలా చేయని వాహనాలపై ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తారని, సీజ్ చేయనున్నట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లఘించి ఓవర్ లోడ్‌తో గ్రానైట్, కంకర, హిల్ రాక్స్ మరియు మినరల్స్ ఎదైనా తోలినట్లయితే ఖచ్చితమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నియమ నిబంధనలు పాటిస్తామని, ఓవర్ లోడ్ ఉండదని, టార్పాలిన్ పట్టను కడతామని చెప్పారు. మైన్స్ శాఖ టిఏ సురేష్ బాబు, రాజా నాయుడు, ఎంవీఐలు ఏ కిరణ్ ప్రభాకర్, రామ చంద్ర రావు, ఎల్ సురేంద్ర ప్రసాద్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

