వాళ్లిద్దరు స్నేహితులు. పనిపై గుంటూరు వెళ్లి ముగించుకుని తిరిగి ఇంటికి వస్తూ గుంటూరు సమీపాన చౌడవరం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాధంలో తూర్పుగంగవరం యువకులు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే… తూర్పుగంగవరం ఎస్సీకాలనీకి చెందిన చాట్ల అభిషేక్(18), చాట్ల నానీ (16) ఇద్దరు స్నేహితులు. అభిషేక్ గ్రామంలో వుంటూ ఎలక్ట్రికల్ పని చేస్తుంటాడు. అబి షేక్ తల్లిదండ్రులు జేమ్స్ , జానీ కూలీపనులు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. అతనికి ఇద్దరు చెల్లెలు వున్నారు. చెల్లెలు చదువుకుంటున్నారు. చాట్ల నానీ తండ్రి ఏసేబు ఎలక్ట్రికల్ పని చేస్తుండగా తల్లి లింగమ్మ కూలీ పనులు
కుంటూ జీవనం సాగిస్తున్నారు. అతనికి ఇద్దరు చెల్లెలు వున్నారు. చెల్లెలు చదువుకు ంటున్నారు. చాట్ల నానీ తండ్రి ఎలక్ట్రికల్ పని చేస్తుండగా తల్లి కూలీ పనులు చేసుకుంటు జీవిస్తున్నారు. అతనికి ఇద్దరు సోదరులు, అక్క వున్నారు. నానీ హైద రాబాద్ లో బేల్దారీ పనులకు వెళ్లి క్రిస్మస్ పండుగకు ఇంటికి వచ్చాడు. ఇద్దరు స్నేహితులు కావటంతో అభిషేక్ పనిమీద గుంటూరు వెళుతూ వుండగా తోడు గా
వెళ్లాడు. పని ముగించుకుని వస్తుండగా చౌడవరం వద్ద మోటార్ సైకిల్ అదుపు తప్పి డివైడర్ ను
ఢీకొని అక్కడిక్కడే మృతి చెందారు. ఇద్దరు అవివాహితులు. ఉదయం వెళ్లిన ఇద్దరు స్నేహితులు మృతి చెందారన్న సమచారంతోఎస్సీకాలనీలో
విషాదచాయలు నెలకొన్నాయి.అందరితో కలుపు గోలు గా వుండే ఇద్దరు యువ కులు మృతి చెండటం కాలనీలో విషాదఛాయలు అలుము కున్నాయి.




