సికింద్రాబాద్, డిసెంబర్ 29 ( జే ఎస్ డి ఎం న్యూస్): ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసమే7 కాకుండా మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో మార్పుకు నాంది పలుకుతుందని చీఫ్ గెస్ట్ మిసెస్ ఇండియా తెలంగాణ క్రౌన్ విన్నర్ సుధా నాయుడు అన్నారు. బేగంపేట ఫ్యామిలీ వరల్డ్ లో ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ ఫ్యాషన్ మీట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఫ్యాషన్ షో లో మహిళలు, పిల్లలు, టీనేజర్లు ధైర్యంగా ర్యాంప్‌పై నడిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇది కేవలం అందం కాదు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. విజేతలుగా నిలిచిన మిస్ కేటగిరి నుంచి మాహితిరెడ్డి, మిసెస్ కేటగిరి నుంచి ఝాన్సీ లకు చీఫ్ గెస్ట్ సుధానాయుడు వారికి క్రౌన్ లను అందించి, బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫెమి–9 అధ్యక్షురాలు అను, ఉపాధ్యక్షురాలు హేమ, కార్యదర్శి విజయ, ఫౌండర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.



