హైదరాబాద్ డిసెంబర్ 29, (జే ఎస్ డి ఎం న్యూస్) :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్-సికింద్రాబాద్ జిల్లా, అమీర్ పేట్ శాఖ ఆధ్వర్యంలోపడాల రామారెడ్డి లా కాలేజీలో 44వ రాష్ట్ర మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతర ఉద్యమాలతో విద్యార్థుల సమస్యలపై గళమెత్తుతున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని అన్నారు.జనవరి 3,4,5 తేదీలలో శంషాబాద్ లో రాష్ట్ర మహాసభలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ మహాసభల్లో దాదాపు 800మంది విద్యార్థి నాయకులు, ప్రొఫెసర్లు, ప్రముఖులు, రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థి నాయకులు హాజరవుతారని తెలిపారు. విద్యారంగ సమస్యలపైన, విద్యారంగస్థితి, రాష్ట్ర సమస్యలు, పర్యావరణ పరిరక్షణ, డ్రగ్స్ మహమ్మారి నిర్మూలన తదితర అంశాలపై తీర్మాణాలు చేయనున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని విద్యార్థి నాయకులు మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మహానగర్ లా ఫోరమ్ కో కన్వీనర్ మిద్దెల గౌతమ్ రెడ్డి, జిల్లా కలమంచ్ కన్వీనర్ దిలీప్, శివరాజ్ ,పడాల రామా రెడ్డి లా కాలేజీ కార్యదర్శి రామ చేతన్ , మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.
