ప్రధానమంత్రి బాల పురస్కార్ అందుకున్న టి.వి.కార్తికేయను సన్మానించిన మంత్రి సీతక్క..

(జే ఎస్ డి ఎం న్యూస్) : చిన్న వయసులోనే పర్వతారోహణలో అద్భుత ప్రతిభ కనబరిచి, రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అందుకున్న టీవీ కార్తికేయను సోమవారం మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ ప్రజా భవన్‌లో మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు. ఈ విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని, మరెందరో చిన్నారులకు అతడు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని కొనియాడారు. భవిష్యత్తులో కార్తికేయ మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *