ఆరోగ్యం కోసం ఆసుపత్రుల పాలుకాకుండా మంచి ఆహార ఉత్పత్తులను వినియోగించుకోవాలని ఖర్చును తగ్గించుకోవటమే కాకుండా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. మండల కార్యాలయాల కాంప్లెక్స్ ఆవరణలో సోమవారం ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో సాగు చేసిన కూరగాయాల పండ్ల స్టాల్స్ను ఏర్పాటు చేసారు. అధికారులు ప్రజలు గమనించి ప్రతి సోమవారం స్టాల్స్ ఏర్పాటు చేస్తామని వినియోగించుకోవాలని కోరారు. మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య, ఎఈ హనుమంతరావు, డిప్యూటీ తహసీల్దార్ గోపాలుని ఫణీంధ్ర, ఐసీఆర్ పీలు నాగేశ్వర రావు, అనంత లక్ష్మి, వాణి, కోటి రత్నం, శివ పార్వతి, నాగ నుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
