తాళ్లూరుకు చెందిన ఇరువురికి సోమవారం దర్శి టిడిపి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసారు. తాళ్లూరు కు చెందిన ఇడమకంటి వరలక్ష్మి కి రూ. 80వేలు, కోట కోటేశ్వరమ్మకు రూ.35 వేల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. పార్టీ తాళ్లూరు మండల అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.
