ఇంటింటికి పైలేరియా పరీక్షల కార్యక్రమం బొద్దికూరపాడులో మంగళవారం నిర్వహించారు. తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు. నైట్ బ్లడ్ సెమన్ను సేకరించారు. జ్వరం, జలుబు, వళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే తక్షణమే సంప్రదించాలని కోరారు. ప్రతి ఇంటిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పైలేరియా లక్షణాల గురించి వివరించారు. కార్యక్రమంలో దర్శి సబ్ యూనిట్ ఆఫీసర్ బసవా రెడ్డి, హెచ్ ఓ చంద్రశేఖర్ బాబు, హెల్త్ అసిస్టెంట్ గోపి నాయక్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంటింటికి పైలేరియా పరీక్షలు కార్యక్రమం నిర్వహణ
30
Dec