యూరియా అధికంగా వాడటం అనర్థదాయకమే అని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరులో పలు ఫెర్టిలైజర్స్ దుకాణాలను మంగళవారం అకస్మికంగా తనిఖీ నిర్వహించి నిల్వలను పరిశీలించారు. రైతులు తక్కువ ధరకు వస్తుందని యూరియాను పశు గ్రాసంలో వేయటం వలన అతి తిరిగా పాల రూపంలో మన వద్దకే చేరుతుందని రసాయనికంగా అధికంగా వాడటం వలన ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెప్పారు. ఎంఆర్పీ ధరలకే యూరియా అందించాలని ఎక్కడైనా అధికంగా అమ్మినట్లయితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
విద్యార్థులు లెక్కలపై అధిక దృష్టి పెట్టాలి …
విద్యార్థులు లెక్కలపై అధిక దృష్టి సారించినట్లయితే అధిక స్కోరుకు ఎక్కువ అవకాశం ఉందని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరు వికే ఉన్నత పాఠశాలకు వంద రోజుల ప్రణాళికలతో బాగంగా ఆయనను ప్రత్యేక అధికారిగా నియమించారు. సాధన చేస్తే మంచి మార్కులు సాధ్యమనే అన్నారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మిల్టన్ తదితరులు పాల్గొన్నారు.

