యూబ రైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ యాప్ ద్వారా వ్యవసాయ యంత్ర సేవలు -జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాస రావు

రైతులకు యూబ రైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ యాప్ ద్వారా రైతులకు ప్రభుత్వం వ్యవసాయ యంత్ర సేవలు అందజేయనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్.శ్రీనివాస రావు తెలిపారు. రైతు సోదరులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు గాను ప్రభుత్వం ఈ యాప్ను అందుబాటులోనికి తెచ్చినట్లు చెప్పారు. యాండ్రాయిడ్ ఫోన్ ల
లో ప్లే స్టోర్ ద్వారా యాప్ ను
డౌన్ లోడ్ చేసుకుని ఈ సేవలు పొందవచ్చని చెప్పారు. జిల్లా అంతటా క్యాబ్ బుకింగ్ తరహాలో డ్రోన్ సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఆయా ప్రాంతాలలో రైతులు అద్దెకు ఈ యాప్ ద్వారా డ్రోన్లు మరింత అందుబాటులోనికి రానున్నాయి. జిల్లాలో గత ఏడాది 80శాతం రాయితీపై 44 డ్రోన్లు జిల్లా అంతటా పంపిణీ చేసినట్లు చెప్పారు. రైతులలో ఒకరిని పైలెట్గా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ పైలెట్స్ పొలాలలో సస్యరక్షణ మందులు పిచిచారి ఎరువులు విత్తనాలు చల్లటానికి దీనికి వినియోగిస్తున్నారని చెప్పారు. డ్రోన్ నిర్వాహకులు ఎకరానికి అద్దె వసూలు చేస్తారని చెప్పారు. డ్రోన్ ద్వారా పది నిముషాలలోనే ఒక ఎకరానికి పిచికారి చేయవచ్చని చెప్పారు. రైతుల లోకేషన్ ఆధారంగా సమీపంలోని డ్రోన్లను యాప్ ద్వారా చూపిస్తుందని తెలిపారు. గ్రామాలలో రైతు సేవా కేంద్రాలలో గోడ పత్రాలపై ఉన్న క్యూ ఆర్ కోడ్న స్కాన్ చేయటం ద్వారా డ్రోన్లను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. సమయం ఆదా అవటంతో పాటు కూలీల సమస్యను అధిక మించవచ్చని చెప్పారు. ఈ డ్రోన్ సేవలు వినియోగంపై ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *