హైదరాబాద్, ఫిబ్రవరి 15,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
జైడస్ పింకథాన్ హైదరాబాద్ ఆరో ఎడిషన్ ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో అత్యంత ఉత్సాహంగా జరిగింది. దాదాపు 5,000 మంది మహిళలు ఈ పరుగులో పాల్గొనడం నగరంలో మహిళల ఫిట్‌నెస్ పట్ల పెరుగుతున్న చైతన్యాన్ని చాటిచెప్పింది.తెల్లవారుజామున 5:30 గంటలకే వివిధ వయసుల మహిళలు రఘు వంశీ 3 కి.మీ, లైఫ్‌లాంగ్ 5 కి.మీ, 10 కి.మీ విభాగాలతో పాటు అల్ట్రా-డిస్టెన్స్ రేసుల కోసం సిద్ధమయ్యారు.
తొలిసారి రన్నింగ్ చేస్తున్న వారు, ఉద్యోగినులు, సీనియర్ సిటిజన్లు, అనుభవజ్ఞులైన అథ్లెట్లు అందరూ కలిసి ఒకే వేదికపై పరుగు తీశారు.
అల్ట్రా రన్నింగ్‌లో మహిళల సత్తాఇన్విన్సిబుల్ ఉమెన్’ వేదికగా 50 కి.మీ, 75 కి.మీ, 100 కి.మీ, 100 కి.మీ రిలే వంటి అల్ట్రా విభాగాలను నిర్వహించారు. ఇండియాలో మహిళా రన్నర్లు క్రమంగా అల్ట్రా-రన్నింగ్ వైపు ఆకర్షితులవుతున్నారని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.3 కి.మీ విభాగంలో అమల కలపాల (19 నిమిషాల 10 సెకన్లు), 5 కి.మీ విభాగంలో మౌనిక కలపాల (27 నిమిషాల 32 సెకన్లు),
10 కి.మీ. పరుగులో
వడ్డే నవ్య (49 నిమిషాల 59 సెకన్లు) విజేతలుగా నిలిచారు.పింకథాన్ వ్యవస్థాపకుడు మిలింద్ సోమన్ మాట్లాడుతూ.. “హైదరాబాద్ మహిళలు తమ ఆరోగ్యం కోసం చూపిన ఉత్సాహం అద్భుతం. స్పోర్ట్స్ వేర్ లేదా సంప్రదాయ దుస్తులు అన్నది కాకుండా, ఆరోగ్యం కోసం పరుగు తీయాలన్న నిర్ణయం గొప్పది. వేలాది మంది ఇలా సూర్యోదయ వేళ ఆరోగ్యం కోసం కదలడం శుభపరిణామం” అని పేర్కొన్నారు.ఇన్విన్సిబుల్ ఉమెన్ ఫౌండర్
అంకిత కొన్వర్ మాట్లాడుతూ.. మహిళలు కేవలం ఒక్కసారి పాల్గొని ఆగిపోకుండా, ప్రతి ఏటా పరుగు దూరాన్ని పెంచుకుంటూ ఫిట్‌నెస్‌ను జీవనశైలిలో భాగంగా మార్చుకుంటున్నారని తెలిపారు.జైడస్ లైఫ్‌సైన్సెస్ బియు బయోలాజిక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ కేయూర్ పరేఖ్ మాట్లాడుతూ. “పింకథాన్‌తో మా భాగస్వామ్యం కొనసాగడం సంతోషంగా ఉంది. ఆరోగ్య సంరక్షణ చర్చలు కేవలం ఆసుపత్రులకే పరిమితం కాకూడదని మా నమ్మకం. మహిళల ఆరోగ్యం పట్ల జైడస్ అంకితభావంతో ఉంది. రొమ్ము క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపుపై అవగాహన కల్పించేందుకు ‘ఈజీయెస్ట్ ఎగ్జామ్’ ప్రచారాన్ని చేపట్టాం. వేలాది మంది మహిళలు ఇలాంటి వేదికపైకి రావడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే మంచి అవకాశం లభిస్తుంది” అని వివరించారు.తెలంగాణ ప్రభుత్వం మద్దతుతో జరిగిన ఈ వేడుకలో లోటస్ హెర్బల్స్, లైఫ్‌లాంగ్, సిరోనా, పార్క్ హయత్, ఫ్యుజిఫిల్మ్, బిస్లరీ వంటి అనేక సంస్థలు భాగస్వాములుగా నిలిచాయి. ఫిట్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఈ కార్యక్రమానికి సహకారం అందించాయి.
జైడస్ పింకథాన్ తన తదుపరి పరుగును మార్చి 8న ఢిల్లీలో, ఏప్రిల్ 5న పూణేలో నిర్వహించనుంది.



