రంజాన్ సందర్భంగా పేదలకు 100 రేషన్ కిట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ అడపా -కోట నీలిమ నేతృత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న యువనేత.

బేగంపేట ఫిబ్రవరి 28
(జే ఎస్ డి ఎం న్యూస్) :
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేదలకు 100 రేషన్ కిట్లను కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ అడపా ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని బేగంపేట డివిజన్ ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అభిషేక్ అడపా మాట్లాడుతూ తమ నాయకురాలు కోట నీలిమ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.రంజాన్ పవిత్ర మాసంలో ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా ప్రార్థనలు చేస్తూ ఉపవాస (రోజా)చేస్తారని అన్నారు.
ఈ సందర్భంగా పేద ,ఒంటరి మహిళలకు రేషన్ కిట్లను అందించడం తమ అదృష్టమని అన్నారు.ముందుగా ఈ కార్యక్రమాన్ని బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లో నిర్వహించామని,తమ నాయకురాలు కోట నీలిమతో కల్సి డివిజన్ పరిధిలోని మరికొన్ని బస్తీల్లో కూడా రేషన్ కిట్లను పంపిణీ చేస్తామని అభిషేక్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ గౌస్,సి.రాజేందర్ ముదిరాజ్,హనీఫ్ ఖాన్, మునీర్ ఖాన్,అల్తమాష్, బబ్లూ, ఆయూబ్,కృష్ణ,అక్బర్, వాజీద్,నవాజ్, జమీర్,చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *