జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లను వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి, దర్శి మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకట రెడ్డి (మహేష్), జిల్లా రైతు విభాగం కార్యదర్శి సంగు కొండా రెడ్డి గురువారం ఉగాది సందర్భంగా కలిసి గజ మాలతో సత్కరించారు. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి కటాక్షం ఎప్పుడు ఉండాలని మెమోంటో అందించారు.
