ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది తమ బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా పని చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఆర్.వో.లు, వివిధ విభాగాల నోడల్ ఆఫీసర్లతో గురువారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జడ్పిటిసి ఎంపిటిసి లకు రేపు కూడా నామినేషన్లు ప్రక్రియ ఉన్నందున నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు లోబడి నామినేషన్ వేసే వారితోపాటు ఇద్దరిని అనుమతించాలని నిర్ణీత గడువు లోపల ఉన్న వారిని నామినేషన్ వేసే లాగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు . ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, బ్యాలెట్ బాక్స్ ల భద్రత, బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామాగ్రి సమకూర్చుకోవడంలో జాప్యం లేకుండా చూసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి, వి.ఎస్.టి, వి.వి.టి. బృందాలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని కలెక్టర్ చెప్పారు. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: