ఫిన్లాండ్ విద్యా అధ్యయన పర్యటనకు డా. డి. సరిత ఎంపిక……బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న సరితకు అరుదైన అవకాశం.

హైదరాబాద్ అక్టోబర్ 23,(జే ఎస్ డీ ఎమ్ న్యూస్ ) :
బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న డా. డి.సరితకు అరుదైన అవకాశం దక్కింది.ఫిన్లాండ్ విద్యా అధ్యయన పర్యటనకు డా. డి. సరిత ఎంపిక కావడం పై మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్,అధ్యాపక బృందం, విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అక్టోబర్ 24నుంచి పర్యటన జరగనుంది.
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో, పాఠశాల విద్యాశాఖ తరఫున నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉపాధ్యాయుల ఎక్స్‌పోజర్ విజిట్, ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా ఫిన్లాండ్ పర్యటనకు డా. డి. సరితఎంపికయ్యారు. ఈ పర్యటన అక్టోబర్ 24 నుంచి
జరగనుంది.ప్రస్తుతం ఆమె బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూ, తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అన్న–అక్క మెంటార్‌షిప్ – AI & డిజిటల్ లెర్నింగ్’ కార్యక్రమానికి రాష్ట్ర నోడల్ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఫిన్లాండ్‌లోని ఉత్తమ విద్యా విధానాలు, బోధనా పద్ధతులను అధ్యయనం చేసి, తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి తోడ్పడటం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.ఈ సందర్భంగా డా. డి. సరిత తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, డాక్టర్ యోగీతారాణా, విద్యాశాఖ కార్యదర్శికి డాక్టర్ యోగితా రాణా , కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేనకి, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలభాస్కర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ , SCERT డైరెక్టర్ రమేష్ , అలాగే కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. పద్మావతి లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ అంతర్జాతీయ విద్యా అధ్యయన పర్యటనకు అవకాశం కల్పించినందుకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. పద్మావతి, అధ్యాపక సహచరులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు
డా. డి. సరితను అభినందించి, తెలంగాణ ప్రభుత్వం మరియు పాఠశాల విద్యాశాఖ తరఫున చేపడుతున్న ఈ ఎక్స్‌పోజర్ విజిట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *