తాళ్లూరు: మండలంలో ఎన్నడూ లేనివిధంగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ కృషితో ఎంపీటీసీలు అన్ని ఎకగ్రీవం కావటం అభినందనీయమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం, సోమవరప్పాడు, కొత్త పాలెం గ్రామాలలో ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. మండల టిడిపి అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ జెడ్పీటీసీ అభ్యర్థి కైపు నాగలక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి పనిని చేసామని, అభివృద్ధి, సంక్షేమం కొనసాగింపునకు మరింత ఊత మిస్తూ ఎంపీటీసీలకు ఎకగ్రీవం చేసారని, అదే జోష్ తో జెడ్పీటీసీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఇంటికి ఎంపీ, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు తిరుగుతూ కూటమి ప్రభుత్వ ఆశయాలను, అభ్యర్థి విజయ ఆవశ్యకతను వివరించారు. అనంతరం కొత్త పాలెంలో తెలుగు రైతు అధ్యక్షుడు కైపు రామకోటి రెడ్డి, జెడ్బీటీసీ అభ్యర్థి కైపు నాగలక్ష్మిల నివాసానికి వెళ్లి వారి అతిథ్యం స్వీకరించారు. ఆయా కార్యక్రమాలలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, నూతన ఎంపీపీ అభ్యర్థి బొమ్మిరెడ్డి రమణమ్మ, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ ఓబులు రెడ్డి, దర్శిమున్సిపల్ చైర్మన్ దారం సుబ్బా రావు, మాజీ జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, మాజీ వైన్ ఎంపీపీ ఐ వెంకటేశ్వర రెడ్డి, మానం రమేష్, బడే, కైపు నాగార్జున రెడ్డి, నవులూరి సాగర్, నారిపెద్ది కళ్యాణ్, వేణు బాబు, మీరా మోహినుద్దీన్, నారేళ్ల కిషోర్, పిన్నిక రమేష్ బాబు, శ్రీకాంత్ రెడ్డి, డానీ, కొత్త పాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకా రెడ్డి, సొసైటీ చైర్మన్ వల్లభనేని నుబ్బయ్య, కరువది మేజర్ ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, ఐ సుబ్బా రెడ్డి జనసేన, బిజేపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.













Save or share this story as a newspaper-style Epaper Clip: