ప్రభుత్వం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ తో వైద్య సేవ లు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల భీమవరం గ్రామంలో డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ నందు బుధవారం ఫ్యామిలీ ఫిజీషియన్ ద్వారా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యధికారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నీ ప్రజలకు ఖరీదైన వైద్యం అందిస్తుందన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకొని వైద్య సేవలు పొందాలన్నారు. ప్రభుత్వం 104 వాహనం ద్వారా 74 రకాల మందులు 12 రకాల టెస్టులు చేసి మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో ఐదు మంది గర్భిణీలు 5 మంది బాలింతలు 35 మంది షుగర్ 25 మందికి బిపి పరీక్షలు ఐదు మందికి సాధారణ వ్యాధులు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 104 డీఈవో వెంకటప్రసాద్ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఫ్యామిలీ ఫిజీషియన్ తో వైద్య సేవలు
25
Jan