వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేద వాడి స్వంత ఇంటి కల సాకారం- అందుకు త్వరితగతిన చర్యలు – గృహా నిర్మాణ శాఖ పురోభివృద్ధిపై సమీక్షలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేద వాడి స్వంత ఇంటి కల నేరవేర్చటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేసారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. దొనకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం గృహ నిర్మాణ శాఖ పురోభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ…. స్థలాలు లేని ప్రతి పేద వానికి స్థలం, నివాసం మంజూరు చేసి వారు గృహం నిర్మించేందుకు త్వరితగతిన బిల్లులు సైతం అందిస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు ఉపయోగించుకుని సకాలంలో నివాసాలు నిర్మించుకోవాలని చెప్పారు. ఏవైనా సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కారానికి అధికారులతో స్థానిక ప్రజా ప్రతినిథులు, వైఎస్సార్సీపీ నాయకులు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన మరిన్ని నిధులను పొదుపు సంఘాల ద్వారా మంజూరు చేయిస్తున్నట్లు చెప్పారు. పలువురికి మంజూరు అయిన రుణాలను అందించారు. నివాసాల మంజూరులో ఉన్న సాంకేతిక సమస్యలపై అధికారులతో చర్చించారు. నివాసాలు నిర్మించుకోవటానికి ఆసక్తి ఉన్న ప్రజలు స్థానిక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ బొరిగళ్ల ఉషా మురళి, పార్టీ మాజీ అధ్యక్షుడు కందుల నారపరెడ్డి, జెడ్పీటీసీ సుధాకర్, జిల్లా యూత్ అధ్యక్షుడు గొంగడి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, వైస్ ఎంపీపీలు మిట్టా కోటి రెడ్డి, వడ్లమూడి వెంకటేశ్వర్లు, సర్పంచిల సంఘం అధ్యక్షుడు నాగయ్య, సర్పంచి గ్రెస్ రత్నకుమారి, పలువురు సర్పంచి, ఎంపీటీసీలు అధికారులు ఎంపీడీఓ వసంతరావు నాయక్, తహసీల్దార్ వెంకటేశ్వర రావు, హౌసింగ్ డీఈ నీరీక్షణ రావు, ఎఈ హనుమంతరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *