దొనకొండ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి బోయ వరుణ్ పదవతరగతిలో (560) మార్కులు సాధించటంతో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సన్మానించారు. ప్రభుచారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థి వరుణ్ ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి జీవితంలో మరింత ఉన్నత స్థాయికి రావాలని దీవించారు.
దొనకొండ జిల్లా బీసీ వసతి గృహంలో ఉంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించి బోయ అరుణ్ ఉత్తమ మార్కులు సాధించటం మిగిలిన విద్యార్థులకు ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బొరిగర్ల ఉషా మురళి, పార్టీ మాజీ అధ్యక్షుడు కందుల నారపరెడ్డి, జెడ్పీటీసీ సుధాకర్, జిల్లా యూత్ అధ్యక్షుడు గొంగడి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మి అంజిరెడ్డి, వైస్ ఎంపీపీలు మిట్టా కోటి రెడ్డి. వడ్లమూడి వెంకటేశ్వర్లు. ప్రభు చారిటబుల్ ట్రస్ చైర్మన్ ఆదిమూలపు ప్రభుదాస్, మల్లెల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి వరుణ్ కి సన్మానం
01
Jun