యోగాతో రాజయోగం వస్తుందని యోగా శిక్షణ నిపుణుడు శ్రీరామ్ గురూజీ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా విద్యానికేతన్ స్కూల్లో ఆదివారం ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామ్ గురూజీ మాట్లాడుతూ … యోగాతో దీర్ఘకాలిక వ్యాధులు సైతం అంతం అవుతాయని చెప్పారు. మనస్సు, శరీరం రెండు కూడ అనుసంధానం మో యోగా లక్ష్యమని చెప్పారు. యోగాతో పొందిన ప్రయోజనాలను ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు వివరించారు. వైస్ ఎంపీపీ ఐ.వెంకటటేశ్వర రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఐ. రమాదేవి, రిటైర్డ్ ఉద్యోగ సంఘ జిల్లా సంయుక్త కార్యదర్శి ఐ. వెంకటరెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

