దర్శి పట్టణంలోనికి టర్బోలకొద్ది పాలపొడి చేరుతుంది.సాధారణంగా పాలపొడి ప్రోటీన్ పదార్థం కనుక చిన్న పిల్లలకు త్రాగించే తల్లి పాలకు బదులుగా పాలపొడితో కలిపిన పాలను కూడా ఉపయోగిస్తుంటారు.అంతే కాకుండా బేకరీ లలో తయారు చేసే పాల పదార్థాలైన కేక్ లో, మిల్క్ మేడ్ కేక్ లు, మిల్క్ షేక్స్, పాలకోవా లు, జున్ను వగైరా ల తయారీలలో ఉపయోగిస్తుంటారు.కానీ ఇటీవల కాలంలో కల్తీ పాల తయారీకి కూడా కొందరు అక్రమార్కులు ఆ పాలపొడినే ఉపయోగిస్తుండడంతో పాలపొడి కి డిమాండ్ బాగా పెరిగింది. పాలపొడి యూరియా కొన్ని రకాల వంట నూనెలను ఉపయోగించి అక్రమార్కులు పాలను తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల యొక్క ప్రాణాలతో చలగాటమాడుతూ కల్తీ పాలను విచ్చలవిడిగా తయారు చేస్తూ సొమ్ము చేసుకునే అక్రమార్కులకు కొందరు రాజకీయ నాయకుల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కొన్ని రకాల బ్రాండెడ్ కంపెనీలకు చెందిన పాలపొడిని టీ కాఫీల దగ్గర నుండి అనేక రకాల ఆహార పదార్థాల తయారీకి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఏ బ్రాండ్ లేకుండా కేవలం తెల్ల గోతాల్లో టన్నులకొద్దీ పాలపొడి దర్శి ప్రాంతానికి చేరుతుండడం అనుమానాస్పదంగా మారింది. పాల పొడి దర్శి నియోజకవర్గంలోని ఏఏ గ్రామాలకు వెళుతుంది దానితో వారు ఏ ఏ ఉత్పత్తులు చేస్తున్నారు అనే దానిపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. టన్నులకొద్ది పాలపొడి దర్శికి దిగుమతి అవుతుందీ అంటే దర్శి నియోజకవర్గం నుండి ఇంకెన్ని టన్నుల ఉత్పత్తులు ఎగుమతులు అవుతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. లారీలకొద్దీ పాలపొడి కొన్ని గూడెం లలో దాచి ఉంచడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. గత రెండు మూడేళ్లుగా ఎన్నో గ్రామాలలో కల్తీ పాలు తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా కొందరు దొరికినప్పటికీ వారిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ల్యాబ్ కు పంపించిన పాల శాంపిల్స్ రిజల్ట్స్ కూడా సంవత్సరాలు గడుస్తున్నా రాకపోవడం అనుమానాలకి బలం చేకూరుస్తుంది. ఏది ఏమైనా దర్శి నియోజకవర్గానికి లారీల కొద్దీ పాలపొడి చేరడం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది.
దర్శికి టర్బోల్లో చేరుతున్న పాలపొడి
04
Jun