దర్శి తాసిల్దార్ శ్రావణ్ కుమార్ ను రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే మార్చారని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొట్లూరి కొండారెడ్డి వ్యాఖ్యానించారు.దర్శి నియోజకవర్గంలో కొందరు అధికారులను మార్చడం పరిపాటిగా మారిందని,ప్రజలకు ఉపయోగపడే ఏ అధికారి వచ్చినా కొందరు నాయకులు జీర్నించుకోవడం లేదన్నారు. పనిగట్టుకొని మరి కావాలనే తాసిల్దార్ శ్రావణ్ కుమార్ ను ఇక్కడి నుండి పంపించారని, ఇష్టం వచ్చిన రీతిలో అధికారులను మార్చడం మానుకోవాలని హితవు పలికారు.దీనిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
దర్శి తాసిల్దార్ శ్రావణ్ కుమార్ ను రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే మార్చారు- కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొట్లూరి కొండారెడ్డి
04
Jun