దర్శి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎస్సీ లేదా యస్టి సామాజిక వర్గాల వారిని నియమించాలి -కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ.

దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియోజకవర్గంలోని ఎస్సీ లేక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి చైర్మన్ గా నియమించాలని నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దర్శి మార్కెట్ యార్డ్ పుట్టినప్పటినుంచి ఒకసారి కూడా దళితులైన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు దర్శి
మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించబడలేదని,ఇప్పటికైనా నియోజకవర్గం లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల జనాభా ప్రాతిపదికన దర్శి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *