యోగాతో మానసిక ప్రశాంతత వస్తుందని యోగా శిక్షణ నిపుణుడు శ్రీరామ్ గురూజీ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా విద్యానికేతన్ యోగా పాఠశాలలో ఆదివారం యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామ్ గురూజీ మాట్లాడుతూ … యోగాతో దీర్ఘకాలిక వ్యాధులు సైతం అంతం అవుతాయని చెప్పారు. మనస్సు, శరీరం రెండు కూడ అనుసంధానంమే యోగా లక్ష్యమని చెప్పారు. శరీరం, ఆత్మల ప్రాముఖ్యత గురించి, పలు యోగాసనాల ప్రాముఖ్యతను వివరిస్తూ యోగసనాలు చేయించారు. యోగాతో పలు ఆటలకు, శాస్త్రయుక్తంగా కుటుంబసభ్యులతో కలసి చేయించారు. యోగాతో పొందిన ప్రయోజనాలను ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు వివరించారు. వైస్ ఎంపీపీ ఐ.వెంకటటేశ్వర రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఐ. రమాదేవి, రిటైర్డ్ ఉద్యోగ సంఘ జిల్లా సంయుక్త కార్యదర్శి ఐ. వెంకట రెడ్డి, హెచ్ఎం క్రిష్ణారెడ్డి, జెసీఎస్ కెవీ పాలెం కన్వీనర్ కొర్రపాటి విష్ణు. పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

