ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయం మేనేజ్మెంట్ కమిటీ(VMC) సమావేశం మంగళవారం ఒంగోలు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మరియు విద్యాలయ కమిటీ చైర్మన్ పి. రాజాబాబు వారి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా విద్యాలయం యొక్క ప్రగతి గురించి గత సంవత్సరంలో 10 వ తరగతి, మరియు 12 తరగతి లలో సాధించినటువంటి ఫలితాలు గురించి, విద్యాలయంలో క్రీడలు, పురోభివృద్ధి గురించి, విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి పలు అంశాలను, అన్ని విషయాలను నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ సి.శివరాం, జిల్లా కలెక్టర్ కు వివరించారు. జిల్లా కలెక్టర్ పి. రాజబాబు మాట్లాడుతూ జవహర్ నవోదయ విద్యాలయ ప్రగతి కోసం ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ ఎ. రఘు, ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొఫెసర్ బి.హరిబాబు, ఒంగోలు ఆర్ డి ఓ చంద్రశేఖర్ నాయుడు, జిల్లా విద్యాధికారి రేణుక, జిల్లా వైద్య అధికారి డాక్టర్ సి. వెంకటేశ్వర్లు, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, విద్యా అభివృద్ధి కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ ఎ. రఘు అందరికి వందన సమర్పణ తెలిపారు.
