జాతీయ టీకా దినోత్సవంను విజయవంతం చెయ్యాలని తూర్పుగంగగవరం పీహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ మౌనిక కోరారు. తూర్పుగంగవరం పీహెచ్సీలో మంగళవారం ఆరోగ్య, ఆశ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 28న కార్యక్రమం నిర్వహించబడునని. తర్వాత రెండు రోజుల పాటు ఆరోగ్య, ఆశ కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని చెప్పారు. వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ఐఓ కె చంద్రశేఖర్ బాబు, హెచ్ ఎన్ వి నుశీల, పీహెచ్ ఎన్ ఎంవీ రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
