బొద్దికూరపాడు లో ఘనంగాచిన్న షారగత్ నిర్వహణ.

బొద్దికూరపాడు లో ఘనంగా
చిన్న షారగత్ నిర్వహించారు.
14వ శతాబ్దంలో త్యాగానికి ప్రతీకగా నిలిచి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన మహమ్మద్ ప్రవక్త కూతురి కొడుకులు , మనవళ్లు అయిన హుస్సేన్, హాస్సేన్ , అబ్బాస్ , ఆలీ అక్బర్, ఆలీ అస్గర్ వారి సైన్యానికి నివాళులర్పిస్తూ, వారి త్యాగాలను స్మరించుకుంటూ నాటినుండి నేటి వరకు మొహరం పండుగకు ముందు చిన్న షారగత్ హిందూ , ముస్లింలు ఐక్యతతో జరుపుకొనే పీర్ల పండగ ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో సోమవారం రాత్రి నుండి తెల్లవారే వరకు పీర్ల ఊరేగింపు ఘనంగా జరిగింది. పీర్లను అలంకరించి నిప్పుల గుండంలో నడుస్తూ మంగళ వాయిద్యాలతో , డప్పులతో గ్రామం మొత్తం ఊరేగింపు చేశారు. పీర్లకు మొక్కుకుంటే పిల్లలు లేనివారికి పిల్లలు పుడతారని , పెళ్లి కాని వారికి పెండ్లి అవుతుందని, అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులు అవుతారని , భూతాలు తొలగిపోతాయని, గ్రామానికి మంచి జరుగుతుందనే నమ్మకంతో హిందూ , ముస్లింలు ఐక్యతతో పీర్లను ఊరేగింపు చేస్తారు. స్థానిక ముస్లింలతో పాటు వృత్తి వ్యాపార బతుకుదెరువు రీత్యా వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి ముస్లిం యువతీ యువకులు గ్రామంలోని హిందువులతో కలసి ఆనవాయితీగా ప్రతి సంవత్సరము ఈ పండుగను జరుపుకుంటారు. పీర్లకు ఊరేగింపు సందర్భంగా మొక్కుబడి ఉన్నటువంటి వాళ్లు వారి ఇండ్ల వద్దకు పీర్లు వచ్చినప్పుడు మొక్కు బడులు చెల్లించుకుంటారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, పిల్లలు, పెద్దలు, మహిళలు , భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *