బేగంపేట జూన్ 24 :
నేరాల నియంత్రణకు సీ సీ కెమెరాలు ఎంతో అవసరం అని, ప్రతి కాలనీ, బస్తీ లలో
సీ సీ కెమెరాలు ఏర్పాటు తప్పని సరి అని బేగంపేట ఇన్స్పెక్టర్ సైదులు అన్నారు. బుధవారం బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని
చంద్ర నగర్ కాలనీ ( రసుల్ పుర ) వాసులకు సీ సీ టి వి కెమెరాల ప్రాముఖ్యత వివరించారు. దీంతో కాలనీ వాసులు స్వచ్చందంగా ముందుకు వచ్చి గురువారం రోజున తామంతా తామే కాలనీ లో సి సి
కెమెరాలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు.దీంతో నేరాల నియంత్రణ జరుగుతుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. పోలీస్ అధికారుల సహకారంతో వెంటనే ఏర్పాటు చేసుకుంటామని బస్తీ వాసులు చెప్పారు. ఇది సంతోషకరమైన నిర్ణయం అని ఇన్స్పెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో
డి ఐ శ్రీనివాస్, ఎస్సై శ్రావణ కాలనీ వాసులు పాల్గొన్నారు.
