తాళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు నారా లోకేష్ బాబు యువ గళం కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లారు. తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి , పార్లమెంట్ కార్యవర్గ సభ్యులు రమేష్ బాబు, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయ కులు షేక్ కాలేశా బాబు (బడే), మాజీ అధ్యక్షుడు ఎస్. కొండారెడ్డి ,తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, యువ నాయకుడు సాగర్, సుబ్బయ్య, దర్శి నియో జకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మీరా మొహిద్దిన్ బీసీ సెల్ అధ్య క్షులు పిన్నికి రమేష్ బాబు, సీనియర్ ఐ.శ్రీనివాస్ రెడ్డి, గొంది రమణా రెడ్డి (సమర), సర్పంచులు చంద్రగిరి గురువారెడ్డి, కేఎస్ రామయ్య లోకేష్ బాబుకి ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు, యువకులు బహిరంగ సభకు తరలి వెళ్లారు.
