ఓటరు జాబితా పకడ్భందీగా రూపొందించాలి – ఏఈఆర్వో వెంకటేశ్వరరావు

తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలని దర్శి నియోజకవర్గం అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ అధికారి (ఏ.ఈ.ఆర్.ఓ) తహశీల్దార్ కే. వెంకటేశ్వరరావు అన్నారు. తాళ్లూరు తహశీల్దార్ కార్యాలయంలో బీఎల్ఎలు, వీఆర్వోలతో ఓటరు సర్వేపై సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే డోర్ నెంబరులో 10 ఓట్లు కంటే ఎక్కువ ఉన్న వాటిని నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా ఫారం -8 ద్వారా వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు. ఓటరు జాబితాలో డోర్ నెంబరు లేకపోవడం, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం, ఫొటోలు కనిపించకపోవడం, డబుల్ ఎంట్రీలు, దొంగ ఓట్లు వంటి వాటిపై దృష్టి సారించి ఖచ్చితమైన ఓటరు సర్వే చేపట్టాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు ఫామ్-6 ద్వారా నూతన ఓటు నమోదు పక్రియ వేగవంతం చేయాలన్నారు. గత నెల 21 నుంచి ఇప్పటి వరకు కొత్త ఓటుకు నమోదు చేసుకున్న దరఖాస్తులు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ కేవీ ప్రసాద్, ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ దేవీ ప్రసాద్, డీటీ ఇమ్మానియేలు రాజు, సీనియర్ అసిస్టెంట్ పీవీఎస్ఆర్ మూర్తి, బీఎల్ ఓలు, వీఆర్వోలు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *