పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి నగర పంచాయతీలోని 17వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ గడప గడపకూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు, కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి మహేష్), రాష్ట్ర గ్రేడింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టరు కుమ్మిత అంజిరెడ్డి, నగర పంచాయతీ కమిషనర్ మహేష్, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, కౌన్సిలర్ విసిరెడ్డి, హరీష్, భాస్కరరెడ్డి, రమణారెడ్డి, వివిధశాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటరీలు పాల్గొన్నారు.





