రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి , పరిశ్రమలు స్థాపించి , పంటలకు నీరు అందిచడం ద్వారా అభివృద్ది చేయవచ్చుఅని సిపియం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కంకణాల ఆంజనేయులు అన్నారు.
2వ రోజు ప్రజారక్షణ భేరి ప్రచారయాత్ర కొత్తరెడ్డిపాలెం , రాజంపల్లి గ్రామ బస్టాండు సెంటర్ లో
ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గుండ్లకమ్మ , ముసి , మన్నేరు , సగిలేరు , పాలేరు తదితర నదులు , వాగుల ద్వారా ప్రతి సంవత్సరం 1200 TMC ల నీరు సముద్రంలో కలసి పోతుందని ఆనకట్టలు నిర్మింస్తే జిల్లాలో ఉన్న లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు అందించ వచ్చని ఈ విధంగా పాలక వర్గ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని , ప్రజలు చైతన్యంతో శాసన సభ్యులను , మంత్రులను నిలదీయాలని ఆయన కోరారు. దరిశి నియోజక వర్గంలో దొనకొండ , నిమ్జ్ ప్రాంతాలలో పారిశ్రామిక కేంద్రాలు , జాతీయ డ్రైవింగ్ స్కూల్ లకు నిధులు కేటాయించి పూర్తిచేసి ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు , ఉపాధి కల్పించడం ద్వారా వలసలను నివారంచి జిల్లాని అభివృద్ది చేయ వచ్చని , భూగర్భంలో ఉన్న వనరులను వినియోగించడం ద్వారా గ్యాస్ బండ 400 కే , రూపాయకే యూనిట్ కరెంటు , పెట్రోల్ లీటర్ 60 రూపాయలకే ఇవ్వవచ్చని ఆ విధంగా ప్రజా ప్రణాళికని అములు చేయాలని సిపియం పార్టీ పిలుపు నిస్తుందని అన్నారు.
రామచంద్రాపురం , బండి వెలిగండ్ల, చందలూరు , V.C పల్లి తాండవ రంగారావు మాట్లాడుతూ నడికుడి – శ్రీకాళ హస్థీ రైల్వే లైన్ నిర్మాణానికి 2500 కోట్లు ఖర్చు ఆవుతాయని అంచనా వేశారని , ఇప్పటికి 600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఇలా అయితే ఈ ప్రాంత చిరకాల కొర్కే అయిన రైలు మార్గం ఎప్పటికి పూర్తి ఆవుతుందని ఆవేధన వ్యక్తం చేశారు.
దరిశి నియోజక వర్గం లోని దొనకొండ , కురిచేడు , ముళ్ళమూరు , దరిశి , తాళ్ళురు మండలాల లో నుంచి నాగార్జున సాగర్ ప్రదాన కాలవలు ఉన్నా చందవరం 1,2 , లక్ష్మీపురం , కురిచేడు , దరిశి లకు మంచినీటి చెరువులు ఉన్నా , నియోజక వర్గంలో 92 పంచాయితీలకు గాను 25 పంచాయితీలకు కూడా తాగడానికి NAP మంచినీరు అందించడం లేదని బబుల్స్ డబ్బా నీరు కొనుగోలు చేసి తాగవలసి వస్తుందని , 4,5 కీలో మీటర్లు పక్కా గ్రామాలకు పోయి నీరు తెచ్చుకుంటున్నారని ఈ ప్రభుత్వం MLA ప్రజలకు మంచినీరు కూడా అందించలేక పోవడం అన్యాయం అని , ప్రాజెక్టులకు వచ్చిన నిధులు ఎటుపోతున్నాయని ప్రశ్నించారు.
ఎర్ర ఒభనపల్లి , చలివేంద్ర , దరిశి పట్టణం లోని ప్రాంతాలలో ప్రచారయాత్ర గ్రూపు మీటింగ్ లు పెట్టి విస్థ్రుత ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిపియం నాయకులు సందు వెంకటేశ్వరరావు , రంగనాయకులు , ఉప్పు నారాయణ , కె.వి పిచ్చయ్య , సుబ్బారావు , రవణమ్మ , వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.




