బేగంపేట డివిజన్ లో మాధవరం కు అపూర్వ స్వాగతం -అడుగడుగున మంగళ హారతులు పట్టి స్వాగతం -మరో సారి ఆశీర్వదించండి.మరింత అభి వృద్ది చేస్తా……కూకట్ పల్లి బీ ఆర్ ఎస్ ఎమ్ ఎల్ ఏ అభ్యర్థి…మాధవరం.

మరో సారి తనను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కూకట్ పల్లి ఎమ్ ఎల్ ఏ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా మంగళ వారం కూకట్ పల్లీ నియోజక వర్గం పరిధి లోని బేగంపేట్ డివిజన్ లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరం మాట్లాడుతూ .. కూకట్ పల్లీ నియోజక వర్గం లోని బేగంపేట్ డివిజన్ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక అభివృద్ధి జరిగిందన్నారు. గతం లో ఈ ప్రాంతం లో వర్షం వస్తె ఇళ్లు ముంపుకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు అని తెలిపారు. తాను ఎమ్ ఎల్ ఏ గా అయ్యాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు , మంత్రి కే టి ఆర్ ల సహకారం తో బేగంపేట్ లో వున్న కూకట్ పల్లీ నాలా లో పూడిక తీత చేపట్టి. ఆధునీకరణ చేశామన్నారు. అలాగే బస్తీ నుంచి నాలాకు వెళ్లే డ్రైనేజ్ పైపు లైన్ లను నూతనంగా వేయించడం జరిగిందన్నారు. ఎక్కడి కక్కడ సీ సీ రోడ్ల నిర్మాణం, పార్కుల సుందరీకరణ, ఓపెన్ జిమ్ ల ఏర్పాటు ఇలా ఎన్నో అభి వృద్ది కార్యక్రమాలను చేశామని ఆయన తెలియ జేశారు. మరో సారి కారు గుర్తు పైన మీ అమూల్య మైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ప్రజలను కోరారు. ముందుగా శ్యామ్ లాల్ బల్డింగ్ , ప్రకాశం నగర్, ప్రకాశం నగర్ ఎక్స్టెన్షన్, మయూరి మార్గ్ , మాతాజీ నగర్ లలో మాధవరం ప్రచారం లో పాల్గొన్నారు. ప్రకాశం నగర్ లో యువత మాధవరం ను భారీ గజ మాలతో సత్కరించారు.అనంతరం రోడ్ కు ఇరు వైపులా నిలుచొని పూలు జల్లులతో స్వాగతించారు. ప్రచార కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ టి.మహేశ్వరి,
డివిజన్ అధ్యక్షులు పొన్న బోయిన సురేష్ యాదవ్,
బీ ఆర్ ఎస్ నాయకులు శ్రీహరి అమరం శ్రీనివాస రెడ్డి,నాగు రఘునాథ్ ,నరేష్.సి.సత్యనారాయణ, కెంబాసారం సురేష్ ,శ్యామ్ బంగారి శ్రీను ,సామాల పాండు, అరిఫ్, షరీఫ్ ఖాన్ ,కే.వి.రాజు ,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *