దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలని హెల్ప్ స్వచ్చంద సంస్థ డైరెక్టర్ బివి సాగర్ అన్నారు. కర్నూల్ రోడ్ లోని గుడ్ న్యూస్ దివ్యాంగ పాఠశాలలో ఆదివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కేక్ ను కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పండ్లు పంపిణీ చేసారు. దివ్యాంగులను హక్కులు చట్టాలపై అవగాహన కల్పించారు. క్రీడలలో కూడ రాణించాలని సూచించారు. విఎఏ అక్ష, సిబ్బంది పాల్గొన్నారు.

