అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందింటమే భారతీయ జనతా పార్టీ అత్యోదయ లక్ష్యమని ఆపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిథి సాధినేని యామిని శర్మ అన్నారు. ఒంగోలు పట్టణంలో బిజేపి కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శివా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిథి సాధినేని యామిని శర్మ మాట్లాడుతూ … గురిగింజ నలుపు తనకు తెలియదు అన్నట్టు 6 దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, లంచగొండితనం, దోపీడీలలో కురుకుపోయి దేశాన్ని, దేశ ప్రజల కష్టాన్ని దోచుకుందని ఎద్దేవా చేశారు.
అన్ని సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దోచుకోవడమే తప్ప చేసిన అభివృద్ధి ఏమి లేదు.
ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో దాదాపుగా 200-300 కోట్ల అవినీతి సొమ్ము ఇంట్లో బట్టలు పెట్టుకున్నట్టు బీరువాలో నోట్లు కట్టలు ఉన్నాయంటే, దేశంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఎన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారో ఊహించుకోవచ్చు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిస్తుంది.
2014 వరకు 18వేల గ్రామాలు విద్యుత్తు లేని గ్రామాలున్నాయని తెలిపారు. 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతి రంగంలో అభివృద్ధి కనబడుతూ ఉన్నది
కాంగ్రెస్ అంటేనే స్కాము భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధి.
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంత్యోదయ అంటే అభివృద్ధి ఫలాలు చిట్టచివరి ప్రజల వరకు చేరాలని అర్ధం.
కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కేంద్ర ప్రభుత్వం నుండి 100 రూపాయలు బయటికి వస్తే కింద లబ్ధిదారుడికి ఒక్క రూపాయి చేరేది. మధ్యలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు లంచాలు తీసుకుంటూ అవినీతిని చేసేవారు కానీ బీజేపీ హయాంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యధా రాజా తధా అధికారులు….
అదే కోవలో ప్రస్తుత వైసిపి ప్రభుత్వం కూడా దోచుకోవడం దాచుకోవడం అనే నినాదం పాటిస్తూ ఉన్నది. ఇష్టా రాజ్యాంగ ప్రజల సొమ్మును దోచుకుంటూ దోపిడీ చేస్తోంది వైసీపీ. ప్రజలు ఈ అవినీతి పార్టీలను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
జిల్లా అధ్యక్షుడు పి వి శివారెడ్డిమాట్లాడుతూ …. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో 2014 ముందు 2014 తర్వాత పరిపాలన చూసుకుంటే ఈ పది సంవత్సరాల పరిపాలన సుపరిపాలన అని ప్రతి ఒక్కరు ఆకలితో ఉండకూడదని కరుణ సమయం నుంచి రాబోవు ఐదు సంవత్సరాల వరకు ఉచిత బియ్యం పంపిణీ సజావుగా ఇస్తున్న ఘనత ఒక నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పారు.
కరోనా వ్యాక్సిన్ మనదేశంలో కాకుండా కూడా ప్రపంచ దేశాలకు ఇచ్చి అందరిని మనం కాపాడు కాపాడుకున్నామని ఈ విధంగా చెప్పారు.
కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బద్దులూరి ఆంజనేయులు.పార్లమెంట్ కన్వీనర్ సెగ్గం శ్రీనివాసరావు,
ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్,ప్రకాశం జిల్లా మీడియా కన్వీనర్ ధని శెట్టి రాము, ప్రకాశం జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు దామోదర్, యస్సి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెముల మోజీ , మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాయాక్.ఐటీ సెల్ కన్వీనర్ గుర్రం సత్యనారాయణ, ఒంగోలు అసెంబ్లీ కో. కన్వినర్ సీత రామయ్య, స్కిల్ ఇండియా కన్వీనర్ పినిన్నటి తిరుమల్ రావు పాల్గొన్నారు.

