డిఆర్సీ ఆధ్వర్యంలో చీమకుర్తి మండల పాటిమీద పాలెంలో శనివారం ఫార్మర్ ఫీల్డ్ నిర్వహించారు. డిఆర్సీ వ్యవసాయాధికారి వి.వి శేషమ్మ, శైలజా రాణిలు పాల్గొని రైతు చీదర్శ కోటయ్య పొలంలో 4వ వారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వరిలో కాండం తొలిచే పురుగు నష్టపరచు లక్షణాలు, పాము పొడ తెగులు నివారణ చర్యలను సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇనుపధాతువు లోపం, ఆకుచుట్టు పురుగు కాండం తొలుచు పురుగు ఉదృతిని గమనించి తగు సూచనలు చెసారు. విఏఏ శృతి తదితరులు పాల్గొన్నారు.

