రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో బిజెపి బలోపేతం కోసం కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేందుకు పార్టీ బాధ్యతల లో యువతకు ప్రాధాన్యతనిస్తూ భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి ప్రోత్సాహంతో ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ఇంచార్జి మరియు జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి నూతనముగా మహిళా మోర్చా నగర అధ్యక్షురాలిగా ధనిశెట్టి పావని ని నియమించారు.
ఈ మేరకు బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి చేతుల మీదుగా ధనిశెట్టి పావనికి పార్టి కండువ కప్పి నియామక పత్రమును అందించారు.
ఈ సందర్భంగా పీవీ శివారెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త తమ గృహము నుండి జీవిత భాగస్వామి మరియు సంతానాన్ని సైతం పార్టీ బలోపేతానికి మరో కార్యకర్తగా తయారు చేయాలని, ఈ విషయంలో జిల్లా మీడియా ఇన్ఛార్జి ధనిశెట్టి రామునాయుడు ముందున్నారని, మంచి ఆలోచన చేసి తమ అర్ధాంగి ధనిశెట్టి పావని ని పార్టీ బలోపేతం కోసం పనిచేసే కార్యకర్తగా తీసుకుని వచ్చారని, ఇది ఒక నూతన సాంప్రదాయంగా అభివర్ణించారు. వీరి ఆగమనానికి కృషిచేసిన తీగల సత్యవతిని అభినందించారు. భర్త అడుగుజాడల్లో పావని భారతీయ జనతా పార్టీకి ఎనలేని కృషి చేయాలని, మరింతమంది కార్యకర్తలను పార్టీకి పరిచయం చేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి విజయకేతనం ఎగరవేసేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. తీగల సత్యవతి మాట్లాడుతూ మీడియా ఇన్ఛార్జిగా భారతీయ జనతా పార్టీకి విస్తృతమైన సేవలు అందిస్తున్న దనిశెట్టి రాము నాయుడు లాగే వారి శ్రీమతి పావని కూడా బిజెపి పార్టీ ఉన్నతి కి పాటుపడతారని తెలిపారు వీరి అధ్యక్షతన నగర కమిటీ ఏర్పాటై పార్టీ విజయ సోపానాలు అధిరోహిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి, ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ఇంచార్జి మరియు జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి, ఒంగోలు మహిళా మోర్చా నగర అధ్యక్షురాలు ధనిశెట్టి పావని, జిల్లా ఉపాధ్యక్షురాలు జజ్జర కృష్ణ వేణి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు చిట్టా తిరుమల మరియు బిజేపి మీడియా ఇంఛార్జ్ ధనిశెట్టి రామునాయుడు, తదితరులు పాల్గొన్నారు.
