తాళ్లూరు మండలంలో ఘనంగా రామానుజన్ జయంతి నిర్వహణ

తాళ్లూరు మండలంలోని పలు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో గురువారం గణిత మెధావి రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పి. సుబ్బారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సర్ శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను ఉపాధ్యాయులు వివరించారు. ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులు సురేష్, వెంకటేశ్వర్లు, రవి, షేక్ అబ్దుల్ కరీం, ఆంజనేయులు, పోలబాబు, ప్రభాకర రావు, స్వరూప రాణి, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. తాళ్లూరు ఎబీసీ ఉన్నత పాఠశాలలో రామానుజన్ జయంతి సందర్భంగా విద్యార్థులకు మ్యాథ్స్ లో క్విజ్ పోటీలు నిర్వహించారు. కరస్పాండెంట్ శ్రీనివాస రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు రామానుజన్ జీవిత విశేషాలను వివరించారు. విద్యార్థులు మ్యాథ్స్ లో పట్టు సాధించి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు బహుమతులు అందించారు. ముందుగా ఆయా పాఠశాలలలో రామానుజన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా పాఠశాలల్లో గణిత ఉపాధ్యాయులకు విద్యార్థులకు మ్యాథ్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *