తాళ్లూరు మండలంలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవం నిర్వహణ – రైతు సంక్షేమమే మన అందరి లక్ష్యం

ఆరుగాలం శ్రమించే రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ వారికి కష్టకాలంలో చేయూత ఇస్తే దేశం మరింత పురోగతి చెంది ఆర్ధికంగా పరిపుష్టిగా అవుతుందని ఎంపీడీఓ కెవై కీర్తి అన్నారు. వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద శనివారం జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. వ్యవసాయ శాఖాధికారి బి. ప్రసాదరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిదిగా పాల్గొన్న ఎంపీడీఓ కెవై కీర్తి మాట్లాడుతూ రైతులు ఎన్ని ఆటుపోటులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవటం వారికే సాధ్యమైనదని అన్నారు. పి పి ఎల్ కంపెనీ జోనల్ మెనేజర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. సాంకేతికతను వ్యవసాయంలో జోడించి అనేక రకాల మేలైన ఉత్పత్తులను రైతులకు అందుబాటులో తేవటం జరిగిందని చెప్పారు. పి పి ఎల్ ఉత్పత్తులు ప్రకాశం జిల్లాలో 30వేల టన్నులు ఎరువులు అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పారు. వీటితో పాటు సేంద్రీయ ఉత్పత్తులను సాగుగు పంటలకు సులభతరంగా వినియోగించుకునే విధంగా వచ్చాయని తెలిపారు. పిపి ఎల్ కంపెనీ సెల్స్ ఆఫీసర్ లక్ష్మి మాట్లాడుతూ రైతులు భూ సార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడాలని లోపాలను సరిదిద్దెనప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆమె తెలిపారు. ఉత్తమ సేవలు అందిస్తున్న వ్యవసాయాధికారి ప్రసాదరావు ను, పలువురు ఆదర్శ రైతులను ఘనంగా సన్మానించారు..కార్యక్రమంలో ఫీల్డ్ కోఆర్డినేటర్ ప్రసాద్, వెంకటరావు, రాము, ఎఈఓలు నాగరాజు, రాజ సుందరి, డీలర్స్ అసోషియేషన్ బాధ్యులు వెంకట రావు, నాగి రెడ్డి, శ్రీనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వ్యవసాయాధికారి కార్యాలయం ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫాస్టర్ బ్రదర్ పి బాబు అబ్రహాం దైవ సందేశం అందించారు. ఏసు క్రీస్తు జన్మదినం లోక మంతటికి కళ్యాణం తెచ్చిందని, సర్వ మాన వాళీ క్షేమమునకై రక్షకుడైన ప్రభువు ఈ లోకానికి మానవ అవతారంలో జన్మించారని చెప్పారు. మండల వ్యవసాయాధికారి బి. ప్రసాదరావు మాట్లాడుతూ రైతులకు దేవ దేవుని ఆశీస్సులతో శుభం జరగాలని ప్రతి రైతు కష్టం ఎన్నడూ వృథాగా పోదని వారికి తగిన ప్రతిఫలం అందేలా దేవుడు చల్లగా చూడాలని కోరారు. తదనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రార్థనలు జరిపి ఆశీర్వదించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *