తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం గ్రామంలోని హరిహర సుత అయ్యప్పస్వామి ఆలయప్రథమవార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. గత ఏడాది తూర్పుగంగవరం గ్రామంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అయ్యప్పస్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించారు. ఆలయప్రధాన అర్చకులు స్వామి డాక్టర్ ఆధ్వర్యంలో పండితులు ప్రత్యేకహోమయాగ పూజలు జరిపారు. మహామంగళ హారతి, శాంతికల్యాణం, మహాదారాశీర్వచనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.
తూర్పుగంగవరం లో ఘనంగా అయ్యప్పస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం
24
Dec