క్రీస్మస్ పండగ రోజు పోరాటమే – దరిశి ICDS ఆఫీసు వద్ద 14వ రోజుకు చేరిన సమ్మె – దరిశిలో సమ్మెతో పాటు మ్యూజికల్ చైర్స్ తో ఆట , పాట

అంగన్వాడీలను పండగ పూట కూడా పోరాటం చేసే పరిస్థితిని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతామని ఐసిడిఎస్ దరిశి ప్రాజెక్ట్ నాయకులు ఏ. తిరుపతమ్మ అన్నారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె 14 వరోజు దరిశి ICDS ప్రాజెక్టు వద్ద రిలే నిరాహారదీక్షలను 3వ రోజు అంగన్వాడీ నాయకురాలు బి.అచ్చమాంబ, అజిత, ఉమాదేవి,నర్సమ్మ,రాములమ్మలు దీక్షాపరులకు పూలమాలలు వేసి ప్రారంభించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈసందర్భంగా తిరుపతమ్మ మాట్లాడుతూ‌ గత 14 రోజులుగా సమ్మె చేస్తూ,క్రీస్మస్ పండుగరోజు కూడా భర్త , పిల్లలను , తల్లి, తండ్రి కుటుంబాలను వదలి పస్తులతో రోడ్డున పడాల్సిన పరిస్థితి ని వై.స్ జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ఏర్వడేటట్లు చేసిందని అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించే వరకు సమ్మె ఎన్ని అటంకాలు వచ్చిన చేస్తామని హెచ్చరించారు . కనీస వేతనాలు , రిటైర్ మెంట్ బెనిఫిట్స్ , గ్రాడ్యూటీ లేకుండా ఎంత కాలం దిక్కులేని వారిగా పనులు చేస్తామని 30 సంవత్సరాలుగా పని చేస్తునే ఉన్నామని సమస్యలను పరిష్కరం కోసం MLA లు , మంత్రులు కృషిచేయాలని డిమాండ్ చేశారు.
అంగన్ వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.అనేకరకాల యాప్ లు, రికార్డ్ వర్కు,ఫోటోలు అప్లోడ్ చేయడమే పనివత్తిడిగా ఉందని అన్నిరకాల యాప్ లను రద్దుచేసి ఒకే యాప్ గా చేయాలని అన్నారు.సెంటర్లకు నాణ్యమైన సరుకులను ఇవ్వాలని కోరారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే ఎలా జీవించాలని ప్రశ్నించారు.సమస్యలు పరిష్కారం చేసేదాకా సమ్మెను కొనసాగిస్తామని‌ హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో యూనియన్ నాయకులు చైతన్యభారతి,ప్రశాంతి,వెంకటనర్సమ్మ,ఫాతిమా, సువర్ణ లత,జయమ్మ,సుబ్బారావు,టి.రంగారావు, సందు వెంకటేశ్వరరావు,ఈమని నాగేశ్వరరావు,టి.రంగనాయకులు,ఉప్పు మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *