మిరప సాగు రైతులను నిత్యం అప్రమత్తం జిల్లా ఉద్యానవశాఖాధికారి వైఎంఎన్ ఎస్ గోపిచంద్ వివరణ

జిల్లాలో మిరప సాగు చేయు రైతులను నిత్యం అప్రమత్తం చేస్తున్నామని జిల్లా ఉద్యాన శాఖాధికారి వైఎంఎన్ విఎస్ గోపిచంద్ అన్నారు. మిర్చిపై తెగుళ్ల విజృంబణ – రైతులకు నష్టాలు అన్న శీర్షికణ ఒక దిన పత్రికలో ఆదివారం వచ్చిన కథనంపై ఆయన మంగళవారం వివరణ ఇచ్చారు. జిల్లాలో 84,900 ఎకరాలలో సుమారు మిర్చ సాగు చేస్తున్నారని, జిల్లాలో పది మంది ఉద్యాన విస్తరణ అధికారులు గ్రామ ఉద్యాన, వ్యవసాయ సహాయకులు ద్వారా ఉద్యానశాఖ మిరప రైతులకు నిరంతరం సలహాలు తగు సూచనలు చేస్తున్నట్లు చెప్పారు. మిరప సాగు బడిలో విత్తన ఎంపిక మొదలు నారు మడి పెంపకం, సమగ్ర యాజమాన్య పద్దతులు, నాణ్యత అభివృద్ధి పై విస్తృతమైన ప్చారం చిల్లీ క్యాంపైన్ ద్వారా చేయుచున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలలో మిరప సాగులో వివిధ మెలుకువలు డిజిటల్ గ్రీన్ వారి వీడియోల ద్వారా రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రతి బుధ, శక్రవారాలు ఉద్యాన అధికారులు వారి ప్రాంతాలలో డ్రిప్ నీటి పారుదల పద్దతులపై నిర్వహణను అత్యధికంగా సాగు చేయబడుతున్న మిరప పొలములలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యానవర్సీటీ నుండి శాస్త్రవేత్తలచే అవగాహన కార్యక్రమాలలో తక్కువ ఖుర్చుతో మిరప పంటలో నాణ్యమైన దిగుబడులు సాధఙంచుటకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందని చెప్పారు. డిశంబర్ మాసంలో సంభవించిన మిచాంగ్ తుఫాన్ తరువాత అధిక వర్షాల సమయంలో మిరప పంటలో సమయాను కూలంగా తీసుకోవలసిన జాగ్రత్తలకు వివరించామని చెప్పారు. చరవాణి ద్వారా, వాట్సాప్ ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి తెగుళ్ల బారి నుండి రక్షణ కల్పించామని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *