దర్శి లో అంగన్వాడీల ఆందోళన ఉధృతం

అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన రోజురోజుకూ ఉధృత మవుతోంది. దర్శి లోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద 15వ రోజు మంగళవారం కా ర్యకర్తలు, హెల్పర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు స్టీల్ పల్లెంపై గరిటెలతో కొట్టి వినూత్న నిరసన తెలిపారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మా ట్లాడుతూ 15 రోజులుగా మహిళలు రోడ్లపై ఆందోళన చేస్తుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డికి పట్టకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు తిరు పతమ్మ, విశ్వవాణి, ప్రశాంతి, మల్లేశ్వరి, మాధవి, వెంకటరమ ణ, దయామణి, చైతన్యభారతి, నాగమణి, బాలమ్మ, సీఐటీయూ నా యకుడు సందు వెంకటేశ్వ రరావు, హనుమంతరావు, రంగారావు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *