దక్షణ ప్రాంత నల్లరేగడి మరియు తేలిక నేలలలో అక్కడక్కడ మల్లె విస్తరించే ఉన్నదని రైతులు కొన్ని పద్ధతులు అవలంభించటం వలన నివారించవచ్చని ఒంగోలు ప్రాంతీయ బోర్డు అధికారి ఎం. లక్ష్మణరావు అన్నారు. బోర్డు పరధిలో శుక్రవారం పలు తోటలను పరిశీలించి తగిన సూచనలు చేసారు. పొగాకు మల్లె పరాన్నజీవి కులపు మొక్క అని మరియు పొగాకు వేరు నుండి పోషకాలను తీసుకుని పొగ మొక్కను క్షీణింప చేస్తుందని, ఆకు నాణ్యత దెబ్బతినే విధంగా చేస్తుందని చెప్పారు. నివారణకు పూత దశ ముందే సమూలంగా తొలగించి పొలమునకు దూరంగా రెండు అడుగుల లోతులో గుంతలు తీసి పూడ్చి వేయ్యాలని అన్నారు. పంట మార్పిడి విధానంను అవలంభించిన ఏడల కొంత వరకు పొగ మల్లెను నివారించవచ్చని చెప్పారు. వేప నూనె మల్లె మీద వాడుట వలన కొంత మేరకు క్షీణింపవచ్చని చెప్పారు. కొండెపి వేలం నిర్వాహణాధికారి జి సునీల్ కుమార్, ఎస్జీఓ సాయి కుమార్ తదితరులు
పాల్గొన్నారు
