మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు రాంమోహన్ యాదవ్ ను మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. రాంమోహన్ యాదవ్ తల్లి మీరాబాయ్ ఇటీవల మరణించగా, ఆదివారం నిర్వహించిన దశదిన కర్మకు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
